అటవీ భూములను సాగు దారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామమని... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండ రాం(Kodanda Ram on Podu Lands) అన్నారు. పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టంపై హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమాలోచన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో అఖిలపక్ష నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. ఐక్య పోరాటాల వల్లనే ప్రభుత్వం దిగివచ్చిందని కోదండ రాం(Kodanda Ram on Podu Lands) స్పష్టం చేశారు.
కేంద్రం చట్టం చేసిన 12 ఏళ్ల తర్వాత అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని... అన్ని చట్టాలకు భిన్నమైనది అటవీ చట్టమని కోదండరాం(Kodanda Ram on Podu Lands) అన్నారు. అందుకే వారికి అవగాహన కల్పించాలానే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజనులకు సాగు భూముల పట్టాలు వస్తాయని... గ్రామసభ ద్వారా అర్హులను గుర్తిస్తారని తెలిపారు. అలాగే న్యాయ నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న వారిని గుర్తించి వారికి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని(Kodanda Ram on Podu Lands) పేర్కొన్నారు. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు ముందు వరుసలో ఉంటామని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి: Pil in High Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే
Podu land issue in telangana: పోడు భూములపై శాటిలైట్ మ్యాప్.. ఆ వివరాలు పక్కాగా తేల్చేందుకే!
CM KCR : నవంబర్ 8 నుంచి పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు: కేసీఆర్