తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి ఒంటిగంటన్నర నుంచే ప్రారంభమయ్యాయి. ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ముందుగా తిరుప్పావై పాశురాల ప్రక్రియ నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖుల దర్శనాల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామని ముందుగా చెప్పినప్పటికీ... గంట ముందుగానే 4 గంటలకే సామాన్య భక్తులను అనుమతించారు. నిన్న మధ్యాహ్నం నుంచే కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంతో పరవశించారు.
ఇవీ చదవండి: శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు...