ETV Bharat / state

Tirumala kanuma way closed : తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

Tirumala kanuma way closed : తిరుమల రెండో ఘాట్‌రోడ్‌ను తితిదే అధికారులు మూసివేశారు. తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాద సమయంలో అటువైపు నుంచి వాహనాలు వెళ్లకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది.

ttd
ttd
author img

By

Published : Dec 1, 2021, 7:49 AM IST

Updated : Dec 1, 2021, 10:57 AM IST

Tirumala kanuma way closed: తిరుమల రెండో ఘాట్​రోడ్డులో కొండ చర్యలు విరిగి పడడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో కనుమదారిలో వాహన రాకపోకలు నిలిపివేశారు. రెండో కనుమ దారిలోని లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.. పెద్ద బండరాళ్లు అడ్డంగా పడిపోయాయి. ఘటన సమయంలో వాహన రాకపోకలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై అడ్డంగా రాళ్లు పడటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. రాళ్లను తొలిగించే పనిలో పడ్డారు.

రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేవరకు తిరుమల కొండపైకి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. కొండనుంచి దిగువకు వచ్చే మార్గంలోనే వాహనాలకు అనుమతినిచ్చారు. దిగువ కనుమ దారిలోనే విడతలవారీగా పైకి, కిందకు వాహనాలను పంపిస్తున్నారు.

దర్శనాలు వాయిదా వేసుకోండి..

తిరుమల ఘాట్‌ రోడ్డును తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్‌ రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు పడ్డాయని.. నాలుగు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఘాట్‌ రోడ్డు దెబ్బతిందని తెలిపారు.

తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

'రాళ్లు పడే సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారి మరమ్మతుల కోసం ఐఐటీ నిపుణులు వస్తున్నారు. ఐఐటీ నిపుణుల సూచనలతో రహదారి మరమ్మతుల పనులు చేపడతాం. రహదారి పునరుద్ధరణకు 3 రోజులకు పైగా సమయం పడుతుంది. వాహన రాకపోకలు ప్రస్తుతం దిగువ ఘాట్‌ రోడ్డులో కొనసాగిస్తాం. కొండపైకి ప్రయాణించే రహదారి పూర్తిగా దెబ్బతింది. భక్తులు దర్శనం వాయిదా వేసుకుంటే మంచిది. టికెట్లు ఉన్నవారు 6 నెలల్లో ఎప్పుడైనా దర్శించుకోవచ్చు' -తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Landslides broken in Tirumala: ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో నడకదారి మార్గం చెల్లాచెదురు కావడమే కాకుండా.. కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. తాజాగా మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: paddy procurement: నెలల తరబడి పడిగాపులే.. కర్షకులకు తప్పని కన్నీరు

Last Updated : Dec 1, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.