తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడి ఊరేగింపు ఘనంగా సాగింది. ఆలయ అర్చకులు నైరుతి మూలలో భూమిపూజ చేశారు. అనంతరం వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో శ్రీవారు వివిధ వాహనసేవల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఇవీ చూడండి : 'సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పండుగ... బతుకమ్మ'