ETV Bharat / state

ఏపీలో సంప్రదాయ పూజలైనా.. పిండ ప్రదానాలైనా ‘ఈ-టికెట్‌’ తప్పనిసరి

author img

By

Published : Nov 14, 2020, 2:33 PM IST

Updated : Nov 14, 2020, 2:47 PM IST

తుంగభద్ర పుష్కరాల్లో ‘ఈ-టికెట్​’కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈమేరకు శుక్రవారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా.. ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలు, పిండ ప్రదానాలు దేనికైనా టికెట్‌ ఉంటేనే అనుమతిస్తామంటూ కర్నూలు కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టం చేశారు.

ఏపీలో సంప్రదాయ పూజలైనా.. పిండ ప్రదానాలైనా ‘ఈ-టికెట్‌’ తప్పనిసరి
ఏపీలో సంప్రదాయ పూజలైనా.. పిండ ప్రదానాలైనా ‘ఈ-టికెట్‌’ తప్పనిసరి

తుంగభద్ర పుష్కరాల్లో ‘ఈ-టికెట్‌’కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొవిడ్ నిబంధనల దృష్టా.. ఘాట్ల వద్ద సాంప్రదాయ పూజలకు అనుమతి ఉండటం లేదు. పుణ్య స్నానాలపై నిషేధం ఉందని, పిండ ప్రదానాలు చేసిన వారికి సైతం నదిలో మునకకు అనుమతి లేదన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ను ఈనెల 16, 17 తేదీల్లో ఇంటర్నెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు.

పుణ్యక్రతువులకు వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారినే ఘాట్ల వద్దకు అనుమతిస్తారు. ఇలా బుక్‌ చేసుకున్న భక్తులు.. చరవాణిలో వచ్చిన సందేశంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పిండ ప్రదానం చేసే భక్తులకు నదిలోకి కేవలం రెండు అడుగుల వరకు నీటిలోకే అనుమతిస్తారు. అక్కడే వాటిని వదిలి తలపై నీళ్లు చల్లుకుని వెనక్కి రావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఆవు పేడతో ప్రమిదల తయారీ.. ఎక్కడంటే..?

Last Updated : Nov 14, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.