సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని కూకట్పల్లి సాయినగర్ కాలనీలో తులసి మొక్కలను నాటారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టినట్లు కేపీహెచ్బీ డివిజన్ తెరాస అధ్యక్షుడు సాయిబాబా అన్నారు.
కాలనీవాసులతో కలిసి తులసి తోటలను ఏర్పాటు చేశారు. తులసి చెట్లు ఆయుర్వేద పరంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రేడియేషన్ తగ్గించి మంచి వాతావరణాన్ని కల్పిస్తాయని కాలనీ వాసులు అంటున్నారు. చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేసి మంచి ఔషధ గుణాలు కలిగిన తులసి మొక్కలు నాటుకోవాలని సూచించారు. తులసి మొక్కలను పూజిస్తే దేవతలను పూజించినట్లేనని సాయిబాబా తెలిపారు.