ETV Bharat / state

గృహ హింస ఫిర్యాదుల కోసం 3 గస్తీ వాహనాలు: సీపీ సజ్జనార్‌ - సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 గస్తీ వాహనాలు

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో షీ టీం పోలీసులు ప్రత్యేకంగా 3 గస్తీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డయల్ 100 నెంబర్‌కు గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదు వచ్చిన వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

గృహ హింస ఫిర్యాదుల కోసం 3 గస్తీ వాహనాలు: సీపీ సజ్జనార్‌

author img

By

Published : Jul 24, 2020, 8:34 PM IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీం పోలీసులు ప్రత్యేకంగా మూడు గస్తీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డయల్100 నెంబర్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం గృహ హింస లేదా చిన్నారులపై వేధింపులేనని గుర్తించిన అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు.

వాహనాల్లో మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉంటుంది. డయల్ 100 నెంబర్‌కు గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదు వచ్చిన వెంటనే గస్తీ వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో రెండు అంబులెన్సులు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అవసరమైన వారు డయల్ 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే సంఘటనా స్థలానికి పంపించి తగిన ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.