ETV Bharat / state

రాష్ట్రంలో మూడు వేలు దాటిన కరోనా కేసులు - 99 people Dies due to corona virus virus in Telangana State

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా నిర్ధరణ అయిన వారి సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది. ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Three Thousands crossing corona cases in the Telangana state
రాష్ట్రంలో మూడు వేలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Jun 3, 2020, 11:02 PM IST

Updated : Jun 3, 2020, 11:19 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు మూడు వేలు దాటాయి. మరణాలు వందకు చేరువయ్యాయి. ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఏడుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు 3020కి చేరాయి. ఇవాళ మరణించిన ఏడుగురితో కలిసి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 99కి చేరింది. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్లాస్మా చికిత్స అందించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

జీహెచ్​ఎంసీలోనే అత్యధికం...

ఇవాళ కరోనా సోకిన 129 మందిలో అత్యధికంగా 108 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2 చొప్పున కరోనా బారిన పడ్డారు. యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

వందకు చేరువలో మృతుల సంఖ్య

ఇవాళ కరోనా మహమ్మారికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 99కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,556 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. 1,365 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు కరోనా నిర్ధారణ అయిన రాష్ట్రానికి చెందినవారి సంఖ్య 2,572 కాగా.. మరో 448 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Last Updated : Jun 3, 2020, 11:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.