ETV Bharat / state

బిగ్​బాస్​ పల్లవి ప్రశాంత్​ కేసు - మరో ముగ్గురు నిందితుల అరెస్టు - బిగ్​బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తాజా వార్తలు

Three More Arrested in Pallavi Prashanth Case : బిగ్​బాస్ విన్నర్​ పల్లవి ప్రశాంత్​ కేసులో అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​కు చెందిన అవినాష్​రెడ్డి, సుధాకర్, పవన్​ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Bigboss Winner Pallavi Prashanth Case Updates
Three More Arrested in Pallavi Prashanth Case
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 4:07 PM IST

Three More Arrested in Pallavi Prashanth Case : బిగ్​బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సరూర్​నగర్​కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్​గూడకు చెందిన సుధాకర్, ఇందిరానగర్​లో ఓ ఆస్పత్రిలో ఆఫీస్​ బాయ్​గా పని చేస్తున్న పవన్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించగా చంచల్​గూడ జైలుకు తరలించారు.

సన్​బర్న్ ఈవెంట్ వివాదం - బుక్‌ మై షోపై ఛీటింగ్​ కేసు నమోదు

Bigboss Winner Pallavi Prashanth Case Updates : బిగ్​బాస్ విజయం అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో పల్లవి ప్రశాంత్ సహా అతని అభిమానులు హంగామా సృష్టించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఒక కేసులో పల్లవి ప్రశాంత్ సహా 5గురు వ్యక్తులను, మరో కేసులో నలుగురు మైనర్లు సహా 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా నమోదైన రెండు కేసుల్లో ఇప్పటి వరకూ పల్లవి ప్రశాంత్ సహా 24 మందిని అరెస్ట్ చేశారు.

మరోవైపు హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలు నుంచి బిగ్ బాస్-7(Bigboss) విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా, జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో భాగంగా ప్రతి నెల ఒకటి, 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరుకావాలని, రూ.15 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని నాంపల్లి కోర్టు ప్రశాంత్​ను ఆదేశించింది.

ఇదేం అభిమానం - బిగ్​బాస్​ ఫ్యాన్స్​పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఫైర్

అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్‌ 7 ఫైనల్స్‌ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వివాదం జరిగింది. టైటిల్‌ విజేతగా నిలిచిన ప్రశాంత్‌, రాత్రి 12 గంటల సమయంలో స్టూడియోస్‌ నుంచి బయటకు రావటంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై గొడవ చెలరేగింది. పలువురు రెచ్చిపోయి అమర్‌దీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు.

ఈ క్రమంలోనే దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను జూబ్లీహిల్స్‌ పోలీసులు సుమోటోగా నమోదు చేశారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించి గొడవకు కారణమైన విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.

బిగ్​బాస్ విన్నర్​గా 'పల్లవి ప్రశాంత్'- ప్రైజ్​మనీ మొత్తం రైతులకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.