కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన... ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలంలోని ఏపూరు వద్ద చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మేజాపురం నుంచి నూజివీడు రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న ఆటోను... హనుమాను జంక్షన్ నుంచి సీతారామపురం వెళ్తున్న కారు ఏపూరు సమీపంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న యార్లగడ్డ సుధారాణి, మన్మంత్ అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మరో వ్యక్తి మృతి చెందింది. పెదపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గోస్తాని కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం