రాష్ట్రంలో ముగ్గురు జిల్లాల కలెక్టర్లను బదిలీ9Collectors transfers) చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను కరీంనగర్‌కు బదిలీ చేసింది. అక్కడి కలెక్టర్ కె.శశాంకను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించింది. మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్‌ను ఖమ్మంకు బదిలీ చేసింది. మహబూబాబాద్ అదనపు కలెక్టర్ అభిలాషకు జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్లు ప్రసన్నరాణి, రషీద్‌ను పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మీర్ పేట కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.సుమన్ రావును జమ్మికుంట కమిషనర్‌గా బదిలీ చేశారు. మిర్యాలగూడ కమిషనర్ సీహెచ్ వెంకన్నను హుజూరాబాద్‌కు బదిలీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పురపాలకశాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: CM KCR: 'కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళిత బంధు పథకం లక్ష్యం'