తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదగా కోమరిన్ ప్రదేశం వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది.
ఇదీ చూడండి:కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం: ప్రభుత్వం