ETV Bharat / state

యూత్​ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ముగ్గురు అభ్యర్థులు - hyderabad updates

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయిలో మూడునెలల పాటు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు.

three-candidates-in-the-youth-congress-president-competition-in-telangana
యూత్​ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ముగ్గురు అభ్యర్థులు
author img

By

Published : Dec 4, 2020, 2:52 PM IST

రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తుది పోటీకి ముగ్గురు అభ్యర్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో 59997 ఓట్లతో మొదటిస్థానంలో శివసేనరెడ్డి, 52203 ఓట్లతో రెండోస్థానాన్ని రాజీవ్​రెడ్డి, 21862 ఓట్లతో మూడోస్థానంలో పోరిక సాయిశంకర్ నిలిచారు. దాదాపు మూడు నెలల పాటు యువజన కాంగ్రెస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రకమిటీకి అర్హత సాధించిన వారి వివరాలను www.ycae.in వెబ్​సైట్​లో ఉంచామని తెలిపారు.

మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి రావాల్సిందిగా యువజన కాంగ్రెస్​ ఎన్నికల కమిషన్​ తెలిపింది. వారితో పాటు 28 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను, 33 జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులను ప్రకటించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను జాబితాను వెబ్​సైట్​లో ఉంచామని కాంగ్రెస్ ఎన్నికల పీఆర్వో రాజు పి.నాయర్ తెలిపారు.

ఇదీ చూడండి:కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.