ETV Bharat / state

ఎక్సైజ్‌శాఖ పోస్టింగుల్లో అధికారుల తీన్​మార్

ఎక్సైజ్​శాఖలో పోస్టింగుల్లో విచిత్ర వైఖరి చోటుచేసుకుంటోంది. ఒక్కో అధికారికి మూడేసి చొప్పున అదనపు బాధ్యతలు కేటాయించారు. తాజాగా ఈవ్యవహారంపై ఎక్సైజ్‌ అధికారుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

Three additional responsibilities for each officer in TS excise department
ఎక్సైజ్‌శాఖ పోస్టింగుల్లో ఒక్కో అధికారికి మూడేసి బాధ్యతలు..
author img

By

Published : May 22, 2020, 8:57 AM IST

Updated : May 22, 2020, 9:13 AM IST

ఎక్సైజ్‌ శాఖలో పోస్టింగుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. కొందరు అధికారులకు మూడేసి చొప్పున అదనపు పోస్టింగులు కేటాయించగా.. మరికొందరికి నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం వివాదాన్ని రాజేస్తోంది. తాజాగా ఈవ్యవహారంపై ఎక్సైజ్‌ అధికారుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన సహాయ కమిషనర్లు ప్రణవి, అనిల్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు శంభుప్రసాద్‌, నాగేందర్‌లను తెలంగాణకు కేటాయించారు. వీరంతా గతేడాది చివర్లోనే ఇక్కడ రిపోర్టు చేశారు. అప్పటివరకు సెలవులో ఉన్న మరో ఇద్దరు సూపరింటెండెంట్లూ తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరికి 8 నెలలుగా వేతనాలివ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టారు.

ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో 16 మంది సహాయ కమిషనర్లకు 12 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 12 మంది ఉప కమిషనర్లకు 9 పోస్టులు ఖాళీనే. ఇప్పటికే విధుల్లో ఉన్న అధికారులకే ఈ పోస్టుల్ని అదనంగా కేటాయించడం గమనార్హం.

Three additional responsibilities for each officer in TS excise department
ఎక్సైజ్‌శాఖ పోస్టింగుల్లో ఒక్కో అధికారికి మూడేసి బాధ్యతలు..

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

Last Updated : May 22, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.