ETV Bharat / state

'వేల మంది ఓట్లు మరొక డివిజన్​కు మార్పు'

శాలిబండ డివిజన్​లో ఒక ప్రాంతానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్​ ఓట్లు మరో డివిజన్​లో ఉన్నాయని భాజపా సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు అనేక సార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఉప్పుగూడ డివిజన్​లో సైతం మార్పులు ఉన్నాయని తెలిపారు.

Thousands of votes were transferred to another division in uppuguda
'వేల మంది ఓట్లు మరొక డివిజన్​కు మార్పు'
author img

By

Published : Nov 30, 2020, 9:35 PM IST

ఉప్పుగూడ డివిజన్​లో ఒకే పోలింగ్ బూత్​లో ఉండాల్సిన భార్యాభర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారాయని భాజపా సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ పేర్కొన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉప్పుగూడకు సంబంధించిన కొంత మంది ఓట్లు జంగంమేట్​లో కనిపిస్తున్నాయన్నారు.

ఇదే డివిజన్​లో సుమారు మూడు వేల ఓట్లు గౌలిపురకు మార్చారని తెలిపారు. వాటిని ఇప్పటివరకు సరిచేయకుండా హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యం ప్రజలందరికీ అర్థమవుతుందని.. మేయర్ పీఠాన్ని మజ్లిస్​కు కట్టబెట్టడానికే ఈ కుట్రలు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

'వేల మంది ఓట్లు మరొక డివిజన్​కు మార్పు'

ఇదీ చూడండి : 51వేల మంది పోలీసులతో బల్దియా పోరుకు భద్రత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.