ETV Bharat / state

కరోనా వేళ ఒకే గది ఉన్నవారికి అష్టకష్టాలు - కరోనా కష్టాలతో వలస కార్మికులు

కరోనా కష్టాలతో వలస కార్మికులు నలిగిపోతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో సొంతూళ్లకు తరలిపోయిన లక్షల మంది కార్మికుల్లో చాలావరకు గత రెండు మూడు నెలల్లోనే మళ్లీ పని ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పుడు కరోనా రెండో వెల్లువతో అల్లాడిపోతున్నారు. రేకుల షెడ్లలో, అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో జీవనం సాగించే ఈ బడుగువర్గాల వారు చాలామంది ఈ మహమ్మారి బారిన పడినా చికిత్స కూడా చేయించుకోలేక ఇళ్లలోనే ఉండిపోతున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులకూ ముప్పు వస్తోంది. మరికొందరు ఉన్న ఉపాధి పోతుందనే భయంతో బయటకు కూడా చెప్పకుండా పనిలోకి వెళ్లిపోతున్నారు.. మరికొందరికి అంటిస్తున్నారు. పలుచోట్ల ఇలాంటివారిని ‘ఈనాడు’ కదిలించినప్పుడు, వారి గురించి స్థానికంగా ఆరా తీసినప్పుడు కన్నీటి గాథలు కనిపించాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గోస!

same room at the time of the corona, corona in trouble in telangana
కరోనా వేళ ఒకే గది ఉన్నవారికి అష్టకష్టాలు
author img

By

Published : May 1, 2021, 7:05 AM IST

కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో 80 శాతానికి పైగా లక్షణాలు పైకి కనిపించడంలేదు. మరికొందరికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఇలాంటివారిని ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలున్నా కొన్నిసార్లు సాధారణ పరీక్షల్లో కరోనా బయటపడదు. రక్త, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అంత ఖర్చు భరించలేక కొందరు మొండిగా తిరిగేస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆసుపత్రి ఖర్చులు భరించలేక కొందరు ఇంటిదగ్గరే ఉంటూ సతమతం అవుతున్నారు. చిన్నచిన్న కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు, అపార్ట్‌మెంట్లలో పనిచేసే వాచ్‌మన్ల వంటివారి పరిస్థితి దయనీయంగా ఉంది.

ఇబ్బందని తెలిసినా

ఆయన తాపీమేస్త్రీ (45). కరోనా సోకింది. ఉండేది మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మండలం బాలాజీనగర్‌లోని రేకులషెడ్డులో. ఆయన.. భార్యా, ముగ్గురు పిల్లలు.. అంతా ఒకే గదిలో ఉంటున్నారు. ‘నేను విడిగా ఉండాలని తెలుసు. కుటుంబ సభ్యులకు ఇబ్బందని తెలిసినా ఏం చేయలేకపోతున్నా. దగ్గరలో బంధువులున్నా సాయపడలేదు. పిల్లల్ని వారింట్లో ఉంచుకోమని చెప్పినా ఫలితం లేదు. గదిలోనే వారికి వీలైనంత దూరంగా ఉంటున్నా. చాలా భయంగా ఉన్నా తప్పట్లేదు. పిల్లల్ని ఊరు పంపిద్దామన్నా కరోనా వచ్చినవారు రావొద్దని అనడంతో చేసేదిలేక సర్దుకుపోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెడికల్‌ కిట్‌ కూడా ఇవ్వలేదు. చికిత్సకు.. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లేంత డబ్బులు లేక ఊరుకున్నా’ అని వాపోయాడు.

విషయం దాచాడు..నలుగురికి కరోనా
ఐడీఏ బొల్లారం కాలనీ.. స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసే ఒడిశాకు చెందిన కార్మికుడికి కరోనా వచ్చింది. మరో నలుగురితో ఒకే గదిలో అద్దెకు ఉంటున్నాడు. విషయం బయటపడితే తనకో, వాళ్లకో ఇబ్బంది.. స్థానికంగా విడిగా ఉండేందుకు ప్రత్యామ్నాయం లేదనుకుని విషయం దాచిపెట్టాడు. దీంతో మిగిలిన నలుగురికీ కరోనా సోకింది. తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆ ఐదుగురు.. సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయారు. ఇదే ప్రాంతంలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఒకే గది. ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. ముగ్గురు కోలుకోగా ఓ మహిళ (42) మరణించింది.

పనిచేయకపోతే ఇల్లు గడవదు
కరోనా మహమ్మారి రెక్కాడితే గానీ డొక్కాడని కష్టజీవుల బాధాకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. అనారోగ్య లక్షణాలు కనిపించినా పరీక్షలో పాజిటివ్‌ వస్తే కుటుంబం పరిస్థితి ఏంటి? నేను పనిచేయకపోతే ఇల్లు గడవదు.. అని కొందరు మొండిగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఒకే గదిలో కాపురాలు కావడంతో కొవిడ్‌ సోకినా విడిగా ఉండలేక కుటుంబంతో సర్దుకుంటున్నారు. ఫలితం వాళ్లు కష్టాల్ని ఎదుర్కోవడంతోపాటు.. కుటుంబ సభ్యులు ఇతరులకూ కరోనా వ్యాపించే పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఉద్యోగం పోతుందని భయం

శ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు (32) చర్లపల్లిలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డు. జ్వరం, జలుబు దగ్గు ఉన్నా పరీక్ష చేయించుకోలేదు. ‘కరోనా అని తేలితే ఉద్యోగం పోతుంది. నేను స్నేహితులతో కలిసి ఉంటున్నా. మా రూంలో ఐదుగురం. మెడికల్‌ షాప్‌లో మందులతో నెట్టుకొస్తున్నాను. వైరస్‌ సోకిందని తేలితే.. అటు ఉద్యోగం పోతే.. ఇటు స్నేహితులు నన్ను బయటకు పంపితే పరిస్థితి? ఏంటని ఆలోచిస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా డ్యూటీకి వెళుతున్నా’ అని చెప్పుకొచ్చాడు.

ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేదు

బిహార్‌కు చెందిన ఓ యువకుడు (36) ఈసీఐఎల్‌ ప్రాంతంలో ప్రైవేటు ఉద్యోగి. అతని భార్యకు కరోనా సోకింది. తననూ పరీక్ష చేయించుకోమని చుట్టుపక్కల వారు సూచించినా ససేమిరా అంటున్నాడు. ‘ఉండేది ఒకటే రూము. పరీక్ష చేయించుకుని పాజిటివ్‌ వస్తే నా ఉద్యోగంపై ప్రభావం పడుతుంది. మా కంపెనీలో ఒకరికి కరోనా సోకితే హోం క్వారంటైన్‌ 15 రోజులయ్యాక ఆఫీసుకు వస్తే విధుల్లోకి తీసుకోలేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో పరీక్ష చేయించుకోలేదు. మా ఆవిడకు పాజిటివ్‌ విషయమూ ఎవరికీ చెప్పలేదు. ఇంటి ఓనర్‌ ఖాళీ చేయిస్తారేమోనని భయం. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత కూడా లేదు’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

మొబైల్‌ పరీక్ష కేంద్రాలెక్కడ?

మొబైల్‌ పరీక్ష కేంద్రాలెక్కడ?

మొదటిదశ సమయంలో ఎవరికైనా కరోనా సోకితే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఏ ఇంట్లో కరోనా ఉందో కూడా తెలియని పరిస్థితి. కనీసం రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షల కోసం మొబైల్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాటి సంఖ్యను పెంచాల్సి ఉంది.

వాచ్‌మన్‌ల కష్టాలు ఎన్నో

గరాలు, పట్టణాల్లో లక్షల సంఖ్యలో ఉన్న అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్లు ఒక్క గదిలోనే కుటుంబంతో సర్దుకుని ఉంటున్నారు. ఇలాంటివారు కరోనా బారిన పడ్డప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ రాక్‌టౌన్‌ కాలనీలో 60 ఫ్లాట్లుండే ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మన్‌ కరోనా బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులకు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిసినా తప్పని స్థితిలో ఆ గదిలోనే ఉంటున్నాడు. ‘మా పార్కింగ్‌కు దగ్గరలోనే నీ గది ఉంది. మాకు ప్రమాదం. బయట ఎక్కడైనా ఉండు. లేదా ఊరికి వెళ్లిపో’ అంటూ కొన్లి ఫ్లాట్లవాళ్లు ఒత్తిడి చేస్తున్నారు.

సర్కారీ ఐసొలేషన్‌ పడకలు..

ఇంట్లో విడిగా ఉండడానికి అవకాశం లేని కొవిడ్‌ రోగుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,700 పడకలను ఏర్పాటుచేసింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు కాని చాలామందికి ఈ సమాచారం తెలియడంలేదు.

ఇదీ చూడండి: ఫలితం వచ్చేలోపే ప్రాణం పోయింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.