ETV Bharat / state

ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Apr 12, 2021, 5:20 PM IST

కరోనా వైరస్ రెండో దశలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఉగాది వేడుకలను నిరాడంబరంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పండుగను ప్రభుత్వం తరపున హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

modest Ugadi
ఉగాది వేడుకలు

కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిరాడంబరంగా జరపనుంది. శ్రీ ప్లవ నామసంవత్సర ఉగాది పర్వదినాన్ని ప్రభుత్వం తరపున హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహదారు కేవీ రమణాచారి వేడుకల్లో పాల్గొంటారు. ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్​ కుమార్‌తో ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఉంటుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు వేడుక‌లను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్న మంత్రి... ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.