దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పీపుల్స్ ప్లాజా వద్ద ఎలక్ట్రో షూ గర్ల్ పవర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాస్క్ అవేర్నెస్ కార్యక్రమం పేరిట మహిళల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వహకుడు సిద్ధార్థ తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించేందుకే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని వివరించారు.
మహిళల చేతికి, కాలి బూట్లకు ఒక పరికరాన్ని అమరుస్తామని..ఆ పరికరంతో అమ్మాయిలపై దారుణానికి యత్నిస్తే వారు బూట్లతో దాడి చేస్తే షాక్ కొడుతుందని డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు త్వరలోనే ఈ పరికరాన్ని తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. బస్ స్టాపుల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారు ఎక్కువయ్యారని ఆయన అన్నారు. ఇలాంటి వారిని అరికట్టేందుకే నూతన పరికరాన్ని తయారు చేస్తున్నారని డీసీపీ ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం నూతనంగా ఎలక్ట్రో షూ గర్ల్ పవర్స్ సంస్థ కృషి చేస్తోందని ఆయన కొనియాడారు.
ఇవీ చూడండి : 'హోమియోపతి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి'