ETV Bharat / state

Be Alert: వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే మూడో దశ ముప్పు పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరుస పండుగల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు విస్మరిస్తే ముప్పు పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు.

These precautions are necessary in the wake of a series of festivals !!
వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!
author img

By

Published : Sep 10, 2021, 11:11 AM IST

వరుస పండుగల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు విస్మరిస్తే ముప్పు పొంచి ఉన్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకేచోట జనం గుమిగూడటం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ నగరంలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా... చాలా కేంద్రాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఒక శాతం కంటే తక్కువగానే కేసులు ఉంటున్నాయి. ప్రస్తుతం వరుసగా పలు పండుగలు రానున్నాయి. జనం రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోళ్ల కోసం జనం రోడ్లపై బారులు తీరుతున్నారు. ఎడం పాటించడం లేదు. చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు. షాపింగ్‌లో తోసుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి అనేకరెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

మూడో దశ ముప్పు పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా టీకా వెంటనే తీసుకోవడంతోపాటు సమూహాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

  • బయటకు వెళ్లేటప్పుడు మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌ లేదంటే ఎన్‌95 మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
  • జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో 15 నిమిషాల తర్వాత అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం మేలు.
  • ఇక ప్రతి 15-20 నిమిషాలకు చేతి శుభ్రత పాటించాలి.
  • జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
  • ఇంట్లో కుటుంబ సభ్యులెవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే... ప్రత్యేక గదిలో పెట్టి కరోనా పరీక్షలు చేయించాలి.
  • కరోనా పూర్తిగా తగ్గే వరకు ఈ జాగ్రత్తలు తప్పవు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.