కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోన్న నేపథ్యంలో... రైళ్లలో వెళ్లే ప్రయాణికుల పట్ల అధికారులు దృష్టి సారించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం ఆరు గంటలకు తెలంగాణ ఎక్స్ ప్రెస్, మధ్యాహ్నం 2:50 హుస్సేన్ సాగర్, సాయంత్రం 5:15కు వెళ్లే గోదావరి ఎక్స్ ప్రెస్లలో రోజు ముంబయి వెళ్లే ప్రయాణికుల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
రైల్ వచ్చే వరకు భౌతిక దూరం పాటిస్తూ వారిని స్టేషన్ బయట నిలబెతున్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. పటిష్ఠ బందోబస్తు మధ్య రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.