రాష్ట్రంలో రాగల మూడు రోజులు.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ.. ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి... విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియర్, కర్ణాటక, రాయలసీమగా మీదుగా దక్షిణ ఇంటీరియర్, తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ వరకు ఉన్నట్లు వెల్లడించింది.
ఇవీచూడండి: రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ.. 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి