ETV Bharat / state

DH: 'రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్... వైద్య సౌకర్యాల కొరత లేదు'

తెలంగాణలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు కోటి 25 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలకు కొరత లేదని చెప్పారు.

Dh srinivas
వ్యాక్సినేషన్
author img

By

Published : Jul 12, 2021, 4:46 PM IST

తెలంగాణలో వైద్య సౌకర్యాల కొరత లేదని డీహెచ్ శ్రీనివాసరావు (Dh Srinivasa rao) స్పష్టం చేశారు. ఆక్సిజన్, పడకల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటివరకు కోటి 25 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందన్న డీహెచ్... ఫీవర్ సర్వే ద్వారా పాజిటివిటీ రేటు తగ్గించుకోవచ్చని తెలిపారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల్లో కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని డీహెచ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా మూడో దశ రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకుంటే మన దేశంలో అక్టోబర్-నవంబర్​ నెలల్లో మూడో ఉద్ధృతి (Third Wave) పతాక స్థాయికి చేరుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండో విడత కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న సమయంలో నమోదైన కేసులతో పోల్చితే ఈ దశలో 50శాతమే ఉండవచ్చని అంచనా వేశారు. తీవ్ర ప్రభావం చూపగల వైరస్ రకమేదైనా కొత్తగా వచ్చినట్లయితే మూడో విడత కరోనా వ్యాప్తి వేగం పుంజుకోవచ్చని తెలిపారు.

రెండో విడత విజృంభణ ఆగస్టు రెండో వారానికి ముగిసిపోతుందని తెలిపారు. వ్యాధి నిరోధకత తగ్గి, అనుకున్నంత వేగంగా టీకా కార్యక్రమం జరగకపోతే అక్టోబరు-నవంబరులోనే మూడో దశ పతాక స్థాయికి చేరుకుంటుందన్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అన్ని రకాల వైద్య సదుపాయాలను సమకూర్చుతున్నాం. ముఖ్యంగా ప్రజలు... వారి సహకారం లేకుండా కొవిడ్​ను కట్టడిచేయడం కానీ నివారించడం కానీ సాధ్యంకాదు. గత సంవత్సరం నుంచి మనం పాటిస్తున్న నిబంధనలు... మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం ఇవన్నీ కొనసాగించాలి. ఇంకా కరోనా వైరస్ నుంచి పూర్తిగా ముప్పు తొలగిపోలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కోటి 20 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశాం.

-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్

ఇదీ చూడండి: తొలి దశలో అతిగా యాంటీబయోటిక్​ల వాడకం.. ముప్పు తప్పదా?

ఇదీ చూడండి: మహమ్మారిపై అసమగ్ర యుద్ధం- అడుగడుగునా వైఫల్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.