ETV Bharat / state

Foreign Universities: 'ఇంట్లో ఉండి కూడా విదేశాల్లో కోర్సులు చేయొచ్చు'

Foreign Universities: విదేశీ విద్య ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాల ప్రోత్సాహకాలు పెరిగాయి.. బ్యాంకులు చేయూతనందిస్తున్నాయి. గతంలోలా డబ్బున్న వాళ్లకు మాత్రమే దక్కే ఆస్తి కాదు. చాలా దేశాలు ఉచితంగానే విద్యను అందిస్తుండగా మరికొన్నిచోట్ల పని చేసుకుంటూ చదువుకునే అవకాశాలు ఉన్నాయి.

Foreign Universities
విదేశాల్లో కోర్సులు
author img

By

Published : Jan 1, 2022, 9:16 AM IST

Foreign Universities: విదేశాల్లో చదువు అనగానే చాలామంది అమెరికా, కెనడాల వైపే చూస్తుంటారు. ఇంకా మరెన్నో దేశాల్లో అవకాశాలున్నాయి. జర్మన్‌ భాష నేర్చుకుంటే ఆ దేశంలో ఉచితంగా చదువుకోవచ్చు. గతంతో పోల్చితే వీసా నిబంధనలను పలుదేశాలు కొంచెం సడలించాయి. కొన్ని దేశాల్లో ఎంఎస్‌కు ఉపకారవేతనాలు లభిస్తుండగా.. మరికొన్ని దేశాలు తక్కువ ఫీజులతో చదువు చెబుతున్నాయి. ఉపకారవేతనాలతో ఉచితంగా చదువుకునే అవకాశం సైతం ఉంది. పేద విద్యార్థులకు ప్రభుత్వాలు అందిస్తున్న విదేశీ విద్యాపథకం లాంటివీ ఉపయుక్తంగా ఉంటాయి. విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునే ముందు ఆయా దేశాల ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవాలి. ఆధునిక సాంకేతికత సుదూరంలోని విదేశీ విద్యను అందరికీ చేరువ చేసింది. కొవిడ్‌ కారణంగా ఇల్లు కదల్లేకపోయామనే బెంగ అనవసరం.. ఇంట్లో ఉండి కూడా అనేక విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫికేట్‌ కోర్సులు చేయడానికి ‘మూక్స్‌’ (మేసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) వంటి అవకాశాలున్నాయి.

స్వీడన్‌లో ఎక్కువగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే ఉంటాయి. కొన్ని వర్సిటీలు ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. స్వీడిష్‌ వచ్చిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారు. మాస్టర్స్‌ రెండేళ్లు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించుకునేందుకు ఏడాదిపాటు అవకాశం ఉంటుంది. ఉద్యోగం లభించిన నాలుగేళ్ల తర్వాత పర్మినెంట్‌ రెసిడెన్సీ(పీఆర్‌)కి దరఖాస్తు చేసుకోవచ్చు.

జర్మనీలో విదేశీ విద్యార్థులకు ఉచితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. జర్మన్‌ భాష నేర్చుకోవడం మంచిది. జర్మనీలో ఆంగ్ల మాధ్యమంలో మాస్టర్స్‌ చదివేందుకు వెళ్లేవారు కనీసం జర్మన్‌ బీ1 స్థాయి నేర్చుకోవాలి. విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్‌ పని చేయడానికి అనుమతి ఉంది. పీజీ పూర్తి చేస్తే అక్కడే 18 నెలల పాటు ఉండే అవకాశం ఉంది.

డెన్మార్క్‌లో కోర్సులు పరిశ్రమలకు అనుసంధానమై ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కునేందుకు 18 నెలల వరకు అవకాశం ఉంటుంది. వారానికి 20 గంటలు పని చేసుకునే సదుపాయం ఉంటుంది.

యూకేలో ప్రతిభావంతులకు ఉపకారవేతనాలు లభిస్తాయి. ప్రపంచస్థాయి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. మాస్టర్స్‌లో ఏడాది, రెండేళ్ల కోర్సులున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకు పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా ఉంటుంది. వారానికి 20 గంటలు పని చేసుకోవచ్చు.

కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి, నీవేంటో నిరూపించడానికే వస్తాయి. వాటికి కూడా తెలియాలి... నిన్ను సాధించడం కష్టమని. మన జననం సాధారణమైనదే కావచ్చు. మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.

- అబ్దుల్‌ కలాం

ఇదీ చూడండి: ts government jobs : ఉద్యోగాల భర్తీకి.. కొత్త రోస్టర్‌.. జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా అమలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.