ETV Bharat / state

మెట్రో.. ఇప్పట్లో అనుమానమే! - హైదరాబాద్​ మెట్రో రైళ్లు

లాక్‌డౌన్‌ అనంతరం ప్రజారవాణాకు అనుమతిస్తారా? బస్సులు, రైళ్లు నడిచినా హైదరాబాద్‌ మెట్రో అనుమానమే అంటున్నాయి అధికార వర్గాలు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కొవిడ్‌-19 వ్యాప్తినిబట్టి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. కొంత ఆలస్యంగా మెట్రోరైళ్లను ప్రారంభించే అవకాశాలున్నాయి.

hyderabad metro latest news
hyderabad metro latest news
author img

By

Published : May 7, 2020, 8:11 AM IST

మెట్రోరైళ్లు నడపాలా వద్దా అనేది కేంద్రం ఇంకా నిర్ణయించలేదు. దేశవ్యాప్తంగా ఈనెల 17 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో దాదాపు అన్ని మెట్రోలు ప్రభుత్వాలే నిర్వహిస్తుంటే..గ్రేటర్​ హైదరాబాద్​లో మాత్రం ప్రైవేటు సంస్థ నడుపుతోంది. కేంద్రం మార్గదర్శకాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పరిస్థితులనుబట్టి మెట్రోపై నిర్ణయం తీసుకోనుంది.

అభిప్రాయాల సేకరణ పూర్తి...

లాక్‌డౌన్‌ ముందు మెట్రోరైళ్లను నడిపినట్లు లాక్‌డౌన్‌ అనంతరం నడపడం కుదరదు. నిత్యం లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగించే అవకాశం ఉంది కాబట్టి కొవిడ్‌-19కి అవకాశం లేకుండా కొద్దినెలలపాటు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. కేంద్రం అనుమతిస్తే ఎలా నడపాలనే దానిపై దేశంలోని వేర్వేరు మెట్రోరైలు ఎండీలు ఇప్పటికే రెండు దఫాలు దూరదృశ్య మాధ్యమం ద్వారా చర్చించారు. మరో దఫా చర్చించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ప్రజారవాణాకు సంబంధించి కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) సోమవారం కొన్ని సూచనలు చేసింది. దిల్లీ మెట్రోరైలు సంస్థ భద్రతను చూసే సీఐఎస్‌ఎఫ్‌.. ప్రయాణికులకు, సిబ్బందికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వేర్వేరు దేశాల్లో లాక్‌డౌన్‌ అనంతరం మెట్రోలను ఎలాంటి జాగ్రత్తలతో నడుపుతున్నారనే సమాచారాన్ని అధికారులు సేకరించారు.

ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరి...

  • ప్రయాణికులు ఎంతదూరంలో నిలబడాలనేది మార్కింగ్‌ చేయాలి.
  • డిజిటల్‌ చెల్లింపులు పెంచాలి.
  • స్టేషన్‌ లోపల శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
  • మాస్క్‌ ఉంటేనే మెట్రోలోకి అనుమతించాలి.
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ విధిగా చేయాలి.
  • తనిఖీల వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులను తాకవద్దు.

రూ.వంద కోట్ల ఆదాయానికి గండి..!

మెట్రో రైళ్లు నెలన్నర రోజులుగా డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు నెలలకుపైగా ఈ రైళ్లు నడపక పోవడం వల్ల రూ.వంద కోట్ల ఆదాయానికిపైగా గండి పడిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ మెట్రో నిర్వహణపరంగా ప్రస్తుతం లాభనష్టాలు లేని (బ్రేక్‌ ఈవెన్‌) దశలో ఉంది.

లాక్‌డౌన్‌తో పరిస్థితి మారిపోయింది. మెట్రో రైళ్లు నడవకపోయినా.. డిపోల్లో ఎప్పటికప్పుడు వాటి నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల వ్యయం ఉంటుంది. కరోనాకు ముందు నగరంలో మెట్రో రైళ్లలో నిత్యం నాలుగున్నర లక్షల మంది ప్రయాణించేవారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దశలో ఫిబ్రవరిలో కరోనా కలకలం మొదలైంది. ఐటీ కారిడార్‌లో ఉద్యోగికి ఒకరికి పాజిటివ్‌ వచ్చిందనే ప్రచారంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ మొదలు కావడంతో పూర్తిగా మెట్రో సేవలు బంద్‌ అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.