ప్రతి ఒక్క హిందూ బంధువు గో సడక్ బంద్‌ను విజయవంతం చేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వనస్థలిపురంలో.. యుగ తులసి ఫౌండేషన్, జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గణేష్ టెంపుల్ వరకు శోభాయాత్రను నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ..
ఈ నెల 8న ఎల్బీనగర్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. గో హత్యలను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య నిషేధంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎల్బీనగర్ నుంచి కదిలేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు బి.యన్.రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం భక్త సమాజం, గో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవు : తలసాని