ETV Bharat / state

నెహ్రూ జూపార్క్​లో తెల్లపులి మృతి.. సీసీఎంబీకి రిపోర్టు!

హైదరాబాద్ పాతబస్తీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో 8 ఏళ్ళ తెల్ల పులి 'కిరణ్​' మృతి చెందింది. గత నెల రోజులుగా నియోప్లాస్టిక్​ ట్యూమర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించిందని జూపార్క్​ అధికారులు తెలిపారు. కిరణ్​కు పోస్ట్​మార్టం నిర్వహించి... ట్యూమర్​ నమూనాను సీసీఎంబీకి పంపినట్లు జూపార్క్ అధికారులు ప్రకటించారు.

The White tiger kiran Died with Illness in Nehru zoological park Hyderabad
నెహ్రూ జూపార్క్​లో అనారోగ్యంతో తెల్ల పులి మృతి
author img

By

Published : Jun 25, 2020, 9:52 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో 8 ఏళ్ళ తెల్ల పులి మృతి చెందింది. ఈ మగ పులి పేరు 'కిరణ్​' అని... గత నెల రోజులుగా నియోప్లాస్టిక్​ ట్యూమర్​తో ఇది బాధ పడుతుందని అధికారులు వివరించారు. నెల రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించిందని జూపార్క్​ అధికారులు తెలిపారు. కిరణ్ ఇక్కడే జూపార్క్​లో జన్మించిందని... దాని తండ్రి బద్రి, తాత రుద్ర అనే పులులు కూడా ఇదే వ్యాధితో మరణించాయని జూపార్క్​ నిర్వాహకులు తెలిపారు. కిరణ్​కు పోస్ట్​మార్టం నిర్వహించిన వైద్యబృందం... ట్యూమర్​ నమూనాను సీసీఎంబీకి పంపినట్లు జూపార్క్ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : చితకబాదారు: ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.