రెండు జాతీయ రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో కేంద్రం నిధులు కేటాయించిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన పరిధిలో పూర్తయిన రెండు జాతీయ రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కార్యాలయంలో ప్రారంభించారు.
-
Joined Hon’ble @MORTHIndia Shri @Nitin_Gadkari, MoS Shri @Gen_VKSingh, Sri @VPRTRS, Sri @KomatireddyKVR, MPs & MLAs From Telangana At The Virtual Inauguration & E-Foundation Stone Laying Ceremony Of National Highways Spanning 766KMs & Costing ₹13,169Cr.#InfraBoost4Telangana pic.twitter.com/BFixnBw7XN
— G Kishan Reddy (@kishanreddybjp) December 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Joined Hon’ble @MORTHIndia Shri @Nitin_Gadkari, MoS Shri @Gen_VKSingh, Sri @VPRTRS, Sri @KomatireddyKVR, MPs & MLAs From Telangana At The Virtual Inauguration & E-Foundation Stone Laying Ceremony Of National Highways Spanning 766KMs & Costing ₹13,169Cr.#InfraBoost4Telangana pic.twitter.com/BFixnBw7XN
— G Kishan Reddy (@kishanreddybjp) December 21, 2020Joined Hon’ble @MORTHIndia Shri @Nitin_Gadkari, MoS Shri @Gen_VKSingh, Sri @VPRTRS, Sri @KomatireddyKVR, MPs & MLAs From Telangana At The Virtual Inauguration & E-Foundation Stone Laying Ceremony Of National Highways Spanning 766KMs & Costing ₹13,169Cr.#InfraBoost4Telangana pic.twitter.com/BFixnBw7XN
— G Kishan Reddy (@kishanreddybjp) December 21, 2020
తను చేసిన కృషికి ఇప్పటికే రెండు జాతీయ రహదారుల విస్తరణ పనులు పూర్తయి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చాయని వివరించారు. పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి పదేపదే కోరగా మరో రెండు జాతీయ రహదారుల పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. జాతీయ రహదారి నెంబర్ 365లో నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు మొత్తం 66.563 కిలోమీటర్ల రోడ్డు పనులు రూ. 605.08 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. యాదాద్రి నుంచి వరంగల్ వరకు 99.103 కిలో మీటర్ల రోడ్డును రూ. 1889.72 కోట్లతో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని... మరో ప్రాజెక్టు హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి ఎల్బీనగర్ నుంచి అందోల్ మైసమ్మ(గుడిమలకపూర్) వరకు ఆరులైన్లుగా ఉన్న జాతీయ రహదారిని 8లైన్లుగా మార్చాలని విన్నవించినట్లు తెలిపారు. నకిరేకల్ - నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూ. 390 కోట్లు, ఎల్‌బీనగర్-అందోల్ మైసమ్మ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేటాయించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రం భూమి సేకరిస్తే.. కేంద్రం రోడ్లు నిర్మిస్తుంది'