ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించిందని ఏజీ కోర్టుకు చెప్పారు. 8 వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ధర్మాసనానికి వివరించారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు సమర్పించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విచారణ తేలిన తర్వాత విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్ రుసుము గడువు ఈ నెల 31తో ముగుస్తోందని పిటిషనర్లు తెలుపగా... ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కింద వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- ఇదీ చూడండి: నిమ్జ్ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత