ETV Bharat / state

Pattana pragathi: మూడో విడత పట్టణ ప్రగతికి కార్యాచరణ సిద్ధం!

పారిశుద్ధ్య సమగ్ర నిర్వహణతో పాటు పచ్చదనం పెంపే ప్రధాన ఎజెండాగా పట్టణ ప్రగతి మూడో విడత కార్యక్రమం జరగనుంది. గతంలో చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త వాటిని చేపట్టనున్నారు. మార్కెట్ల నిర్మాణం, వైకుంఠదామాల నిర్మాణాలతో పాటు వైకుంఠ రథాలను సమకూర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి దిశగా కార్యాచరణ అమలు చేయనున్నారు.

మూడో విడత పట్టణ ప్రగతికి కార్యాచరణ సిద్ధం!

author img

By

Published : Jun 25, 2021, 4:02 PM IST

జులై 1 నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి మూడోదశ కార్యక్రమానికి పురపాలక శాఖ సన్నద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా నగర పాలికలు, పురపాలికల్లో కార్యక్రమ అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మూడో విడతలో మొత్తం 24 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అవసరమైన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు..

చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు తదితరాలు దాదాపు అన్నిచోట్లా సాఫీగా సాగుతున్న తరుణంలో వాటితో పాటు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. శిథిలాల తొలగింపు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాల తొలగింపు లాంటివి చేపట్టనున్నారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను ఇప్పటికే యాప్ ద్వారా పర్యవేక్షిస్తుండగా.. నిర్వహణ మరింత సమర్థంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోనున్నారు.

బడ్జెట్‌లో కేటాయింపులు..

విద్యుత్ సంబంధిత అంశాల్లో భాగంగా వీధి దీపాలన్నింటికీ ఎల్ఈడీ బల్బులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎల్ఈడీలతో తక్కువ విద్యుత్ వినియోగం అవుతోందని.. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు రూ.81 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్లు, వైకుంఠదామాల నిర్మాణంపై పట్టణ ప్రగతిలో దృష్టి సారించనున్నారు. ఇప్పటికే మార్కెట్ల నిర్మాణం కోసం రూ.500 కోట్లు, వైకుంఠదామాల కోసం రూ.200 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

ఖాళీ స్థలాలు.. ప్రకృతి వనాలుగా..

అన్ని పట్టణాల్లోనూ జంతు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగానే ఈమారు హరితహారం కార్యక్రమాన్నీ చేపడుతున్నారు. అన్ని పట్టణాల్లో బహుళ వరుసల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణాల్లోని 800 కిలోమీటర్లకు పైగా రహదారులకు ఇరు వైపులా ఒకటి, రెండు, మూడు వరుసల్లో మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 3,500 వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో ప్రకృతి వనాలు..

ఆరో విడత హరితహారంలో భాగంగా ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టారు. అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణం మేర యాదాద్రి నమూనాలో మొక్కలు నాటి ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. కొన్నిచోట్ల స్థలం అందుబాటులో లేక ఆ పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఏడో విడత హరితహారంలో ఎక్కువ విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. కొత్తగా ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో పట్టణానికి ఒకటి చొప్పున ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: వచ్చే నెలలో మూడో దఫా పల్లె, పట్టణ ప్రగతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.