బదిలీలు సహా డిమాండ్ల సాధన కోసం తహసీల్దార్లు చేపట్టిన వర్క్ టు రూల్ను విరమించారు. బదిలీల విషయమై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించటం వల్ల ఈ కార్యక్రమాన్ని ముగించినట్లు తహసీల్దార్ల సంఘం తెలిపింది. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించినట్లు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, తహసీల్దార్ల సంఘం పేర్కొన్నాయి. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియను చేపట్టి వేగంగా బదిలీలను పూర్తి చేయాలని కోరినట్లు సంఘాల నేతలు వెల్లడించారు. బదిలీల విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని... వర్క్ టు రూల్, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి రెండు సంఘాలు కలిసి సమష్టి నిర్ణయంతో వెళ్తాయని తెలిపారు.
ఇవీ చూడండి: ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పరేంటీ?