బతుకమ్మ పండుగ(bathukamma festival 2021) మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు ఈ సంబురాలు అంబరాన్నంటేలా జరుగుతాయి. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేరుస్తూ.. ప్రత్యేకమైన నైవేద్యాలను నివేదిస్తారు. అయితే ఆరోరోజున(bathukamma sixth day story) మాత్రం బతుకమ్మను ఆడరు.
ఆరో రోజు అర్రెం..
ఆరోరోజు బతుకమ్మ(bathukamma day 6) అలుకబూనుతుందని, అలుకతో ఏ పదార్థాన్నీ స్వీకరించదని భక్తుల విశ్వాసం. కనుక ఆ రోజున బతుకమ్మకు ఏ నివేదనా ఉండదు. బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున(bathukamma celebrations 2021) అమ్మవారిని 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు. చాలాచోట్ల దీన్ని 'అర్రెం'గా కూడా పేర్కొంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మ కోసం ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.
రోజుకో తీరుగా..
ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్యతో ఈ పూల పండుగ(bathukamma festival in telangana) ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరిట ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు నువ్వులు, బెల్లం, నూకలతో నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మగా అమ్మావారిని పూజిస్తారు. ఆ గౌరమ్మకు ఇష్టమైన అటుకులతో నైవేద్యం తయారుచేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాలుగో రోజు సందర్భంగా... నానబియ్యం బతుకమ్మను చేస్తారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ'(atla bathukamma) అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అయితే ఆరోరోజున మాత్రం బతుకమ్మ అలుకబూనుతుందని, అలుకతో ఏ పదార్థాన్నీ స్వీకరించదని భక్తుల విశ్వాసం. అందుకే బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మ కోసం ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు.
ఇవీ చదవండి:
- engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ
- Bathukamma day 2: రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?
- Bathukamma day 3, 2021: మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు..
- Bathukamma DAY-4: నాలుగో రోజు'నానబియ్యం బతుకమ్మ'.. ఎలా చేయాలంటే?
- Bathukamma Festival: ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'.. ప్రత్యేకతలు ఏంటంటే..!
- Saddula bathukamma 2021: సద్దుల బతుకమ్మ స్పెషల్.. నైవేద్యాలు ఏంటంటే?