ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు షెడ్యూల్

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు షెడ్యూల్​ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 12వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారు చేయాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రచురించాలి.

The State Election Commission has announced the schedule for the identification and finalization of polling stations for the Greater Hyderabad Municipal Corporation elections
పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు షెడ్యూల్
author img

By

Published : Nov 10, 2020, 8:28 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వార్డుల వారీగా ఇప్పటికే నియమించిన రిటర్నింగ్ అధికారులు ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదం మేరకు ప్రకటించాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఈ నెల 12వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారు చేయాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో నవంబరు 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రచురించాలి. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలను 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాపై ఈ నెల 16వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కమినర్లు సమావేశం నిర్వహిస్తారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ నెల 18వ తేదీ వరకు పరిష్కరించి పోలింగ్ కేంద్రాల తుదిజాబితాను 19వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్​కు సమర్పించాలి. కమిషనర్ ఆమోదంతో నవంబర్ 21వ తేదీన పోలింగ్ కేంద్రాల తుదిజాబితాను ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఆదేశించారు. ఈ ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని... రిటర్నింగ్ అధికారులకు డిప్యూటీ కమిషనర్లు అన్ని విధాలా సహకరించాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.