ETV Bharat / state

హెచ్​సీఏ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించండి: టీసీఏ‌ - central ministre kishanreddy latest news

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అక్రమాలు జరుగుతున్నట్లు రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ఈ విషయమై సీబీఐ విచారణ చేపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

telangana cricket association
నతి పత్రం అందజేశారు
author img

By

Published : Apr 10, 2021, 2:51 AM IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని... తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి వినతి పత్రం అందజేశారు.

ఈ విషయం హోంశాఖ పరిశీలనలో ఉందని సభ్యులకు కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా టీసీఏకు బీసీసీఐ గుర్తింపు విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వందలాది టోర్నమెంట్ మ్యాచ్‌ల వివరాలను బండి సంజయ్‌కి టీసీఏ కార్యదర్శికి గురువా రెడ్డి వివరించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్​కు గుర్తింపు విషయంలో తాను చొరవ తీసుకుంటానని ఎంపీ బండి సంజయ్ టీసీఏ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి మార్గదర్శకాలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.