ETV Bharat / state

సామ్యవాదులతోనే సకల సమస్యలకు పరిష్కారం - omkar bhavan

హైదరాబాద్‌ బాగ్​లింగంపల్లిలో జరిగిన కౌలు రైతు హక్కుల సమావేశానికి జస్టిస్‌ చంద్రకుమార్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలను నివారించాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. అత్యాచారాల విష సంస్కృతిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు.

సామ్యవాదులతోనే సకల సమస్యలకు పరిష్కారం
author img

By

Published : Aug 12, 2019, 8:56 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదర్కొంటున్న సంక్షోభాన్ని, రైతుల ఆత్మహత్యల నివారించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్‌ భవన్‌లో తెలంగాణ రైతు సమాఖ్య, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతు హక్కుల సమస్యలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అక్రమాలు, విలయతాండవం చేస్తున్న నిరుద్యోగం, ఆడిపిల్లలపై అత్యాచారాల విషసంస్కృతి, కులవివక్షత నిర్మూలన వంటి అంశాలపై సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదన్నారు. సామ్యవాద వ్యవస్థ మాత్రమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కరం చూపగలుతుందని, అందుకు వామపక్ష, లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

సామ్యవాదులతోనే సకల సమస్యలకు పరిష్కారం
ఇదీ చూడండి:కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్​ ప్రత్యేక పూజలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.