హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పునర్నియమితులైన డాక్టర్ ప్రవీణ్‌రావు పరిపాలనా భవనంలోని తన ఛాంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి వీసీగా మరోసారి నియమించినందుకు గవర్నర్, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో వాతావరణ మార్పల నేపథ్యంలో రైతులకు మరిన్ని సేవలు అందించడం కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ పాటు ఇతర అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పొరుగు సేవల ఉద్యోగులు ప్రవీణ్‌రావును అభినందించారు.
ఇవీ చూడండి: ఆర్మీ 'ఆయుధ' ప్రదర్శన అద్భుతం