ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో రెండో విడత ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లి పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల గంగులమ్మ అనే వృద్ధురాలు.. తన కుమారుడు, కోడలితో కలిసి బాధ్యత నెరవేర్చింది. ఓటు హక్కును వినియోగించుకుని.. తోటి ఓటర్లకు ఆదర్శంగా నిలిచింది.
మరోవైపు.. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
ఇదీ చదవండి: క్యూ ఆర్ కోడ్ సహాయంతో జీపీఎస్ వాహనాల చోరీ!