ETV Bharat / state

అంతరించిపోతున్నాయి.. కీటకమా నీవెక్కడ? - కీటకాలపై వార్తలు

మానవ చర్యలతో...పకృతిలోని సహజసిద్దమైన కీటక జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని... పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయకపోతే... పెను ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

The season of insect infestation
అంతరించిపోతున్న కీటక జాతులు... ప్రమాదమంటున్న పర్యావరణవేత్తలు
author img

By

Published : Dec 16, 2019, 11:03 AM IST

లక్షల్లో ఉండే సహజసిద్ధమైన కీటకజాతులు పుడమికి అందం. జీవ వైవిధ్యానికి తార్కాణం. సమస్త జీవరాశికి ప్రాణావసరం. ప్రకృతిలో సహజసిద్ధమైన ఆహారగొలుసులో కీలకభాగమయిన వీటి ఉసురును మానవులు తీస్తున్నారు. మన చర్యలతో 4లక్షల కీటక జాతులు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీన్ని అడ్డుకోకుంటే పెను నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

The season of insect infestation
అంతరించిపోతున్న కీటక జాతులు... ప్రమాదమంటున్న పర్యావరణవేత్తలు

పుడమిపైనున్న జీవకోటిలో ఏ ప్రాణీ సర్వస్వతంత్రం కాదు. మనుగడ కోసం మొక్కలపైనో ఇతర జీవులపైనో ఆధారపడాల్సిందే. సున్నితమైన ఈ గొలుసుకట్టులో చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా ప్రతి ప్రాణికీ పాత్ర ఉంది. మానవుడి స్వార్థం ఈ శృంఖలానికి బీటలు వారుస్తోంది. ఆహార గొలుసులో అత్యంత కీలకమైన కీటకాలు రాలిపోతున్నాయి. వాటిని తిని బతికే అనేక పక్షులు, జీవజాతులు ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా మానవులకూ పెను ముప్పే. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కొంటున్నాం.

  1. మానవుల కన్నా కీటకాల సంఖ్య 17 రెట్లు అధికం. మొత్తం జంతుజాతుల్లో కీటకాల వాటా 70%. మానవులు ప్రకృతిని ధ్వంసం చేయడం, మితిమీరి క్రిమిసంహారక మందులను వాడటం వల్ల 1970 నుంచి సగం మేర కీటకాలు చనిపోయాయి.

  2. ప్రస్తుతం మనకు తెలిసిన 10 లక్షల కీటక జాతుల్లో 40 శాతం అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటికితోడు మరో మూడో వంతు మేర జీవులు ఆ దశకు చేరువవుతున్నాయి.

  3. గత శతాబ్దంలో 23 రకాల తేనెటీగ, కందిరీగ జాతులు అంతరించిపోయాయి. ఇదే సమయంలో గత పాతికేళ్లలో క్రిమిసంహారక మందుల వాడకం దాదాపుగా రెట్టింపయింది.
  4. ఒక నిర్దిష్ట ఆవాస ప్రదేశంలోనే ఉండే బ్రిటన్‌ సీతాకోక చిలుకలు.. 1970ల మధ్య నుంచి 77 శాతం మేర తగ్గిపోయాయి. ఎక్కడైనా ఉండగలిగే సీతాకోకచిలుకలు 40 శాతం తగ్గిపోయాయి.

  5. కీటకాలు తగ్గిపోవడం వల్ల ఇతర జాతులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఎగిరే కీటకాలను తినే ‘స్పాటెడ్‌ ఫ్లై క్యాచర్‌’ పక్షి జాతి 1967 నుంచి 93 శాతం పడిపోయింది.

  6. జర్మనీలోని ప్రకృతి రిజర్వులలో గత 27 ఏళ్లలో 75 శాతం మేర కీటకాల సంఖ్య తగ్గిపోయింది.

ఈ బుల్లి జీవులు ఎందుకు అవసరం?

* ఈ కీటకాలు జీవానికి సంబంధించి ప్రాథమిక ఇటుకల్లాంటివి. చిన్నగానే ఉన్నప్పటికీ వాటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిరకాల పర్యావరణ వ్యవస్థలకు వీటి అవసరం ఉంది.
* ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల మేర పంటల్లో పరాగ సంపర్కానికి కీటకాలే ఆధారం. ఇవి లేకుంటే ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.

ఎందుకీ దుస్థితి

*ఆవాసాలు తగ్గిపోవడం
*వ్యవసాయం, పట్టణీకరణ
*క్రిమిసంహారకాలు, ఎరువులు
*వాతావరణ మార్పులు

మనమేం చేయాలి..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కీటకాల హననాన్ని మనం ఆపితే అవి చాలా వేగంగా కోలుకుంటాయి. అందుకోసం తోటలు, పార్కులు, వ్యవసాయ క్షేత్రాలు, పని ప్రదేశాల్లో తక్షణ చర్యలు చేపట్టాలి.
* కీటకాల ఆవాసాలను పెంచాలి.
* పట్టణాల్లోని పార్కులు, వనాలను కీటకాలకు అనువుగా తీర్చిదిద్దాలి.
* పరాగ సంపర్కానికి వీలు కల్పించే తేనెటీగలు, సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలను పెంచాలి.
* తూనీగలు వంటి కీటకాలను ఆకర్షించేందుకు చెరువులు తవ్వాలి.
* చాలా దేశాల్లో అధిక శాతం భూభాగాలు వ్యవసాయం కిందే ఉన్నాయి. క్రిమిసంహారక మందుల వల్ల అవి ఈ కీటకాల పాలిట యమపురిగా మారుతున్నాయి. వ్యవసాయంలో మందుల వాడకాన్ని బాగా తగ్గించాలి.
* మూడొంతుల మేర పొలాల్లో దిగుబడులపై ప్రభావం లేకుండానే రసాయన వినియోగాన్ని తగ్గించవచ్చని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.

చీకటి నింపుతున్న కాంతి

రాత్రివేళ మనం వాడే విద్యుత్‌ దీపాల వల్ల కూడా కీటకాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. మానవ చర్యల వల్ల తలెత్తే వాతావరణ మార్పుల వంటివాటిని తట్టుకోవడం కొంత మేర సాధ్యమైనా.. కాంతి కాలుష్యాన్ని తట్టుకోవడం మాత్రం వాటికి సాధ్యం కావడంలేదు.
* కీటక జాతుల్లో సగం నిశాచర ప్రాణులే.చంద్రుడి వెలుగుగా భ్రమపడుతూ అనేక కీటకాలు బల్బుల చుట్టూ చేరి రెక్కలు ఆడిస్తూ గడిపేస్తాయి. అలసిపోవడం వల్ల కానీ వేరే జీవులకు ఆహారంగా మారడం వల్ల కానీ వాటిలో మూడో వంతు కీటకాలు ఉదయంలోగా చనిపోతాయి.
* ఫైర్‌ఫ్లై బీటిల్స్‌లు సంయోగం కోసం బయోలూమినిసెంట్‌ సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటాయి. కాంతి కాలుష్యంతో వీటికి అవరోధం ఏర్పడుతోంది.

* 60% పక్షులకు కీటకాలే ఆధారం. ఇవి తగ్గిపోతే ఈ పక్షులూ తగ్గిపోతాయి.

* కీటకాల సంఖ్య ఏటా 2.5% మేర తగ్గుతోంది. శతాబ్దంలోపే భారీగా అంతర్థానాలు తప్పవు.

* అనవసర దీపాలను ఆపేయడం, వెలుగు అవసరం లేని చోట్ల నీడను కల్పించడం వంటి చర్యలతో సులువుగా ఈ కీటకాలకు నష్టాన్ని తగ్గించొచ్చు.

ఇవీ చూడండి: దేవుడి గోడు వినేవారు ఎవరు?

Intro:కడప జిల్లా రైల్వేకోడూరులో ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటించారు. రైతుల సమస్యలపై రైల్వేకోడూరు లోని శ్రీ లక్ష్మీ ప్యారడైజ్ సినిమా హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాటి వివరాలు.

Body:రైల్వేకోడూరు టౌన్ లోని శ్రీలక్ష్మి పారడైస్ సినిమా హాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాడు. జనసేన అధ్యక్షుడు రైల్వేకోడూరు కు వస్తున్న సందర్భంగా రైల్వేకోడూరు లోని జనసేన కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైల్వేకోడూరు సరిహద్దు కుక్కల దొడ్డి నుండి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికి రైల్వేకోడూరు టౌన్ లోని సినిమా హాల్లో రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కడప జిల్లాలోని పసుపు రైతులు, మామిడి రైతులు, ఉల్లిగడ్డ రైతులు పడుతున్న సమస్యలను రైతులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని వైకాపా నాయకులు గత కొన్ని రోజుల ముందు చిన్న రాజు పోడు గ్రామంలో 200 చీని నిమ్మ చెట్లను నరికి సంఘటన రైతులు పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు. వీటన్నింటి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉద్యాన పంటలు ఎక్కువగా పండించిన ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయలేదన్నారు. రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి అవుతున్న రాయలసీమ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ నియోజకవర్గంలో వైకాపా నాయకులు జనసేన నాయకులు పంట పొలాలపై దాడి చేయడం మంచిది కాదన్నారు. పచ్చని చెట్లను నరికిన వారు ఆ చెట్ల కన్నీరు వారికి శాపాలు అయి నాశనం అవుతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమ చదువుల సరస్వతి కి నిలయమని కాబట్టి రైల్వేకోడూరులో ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. వైకాపా నాయకుల దౌర్జన్యాలకు భయపడవద్దని మీకు అందరికీ నేను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో లో అమ్మాయి ల పై అఘాయిత్యాలు జరుగుతున్న రాజకీయ నాయకులు కానీ, పోలీసులు కానీ తక్షణమే చర్యలు తీసుకోలేదని వారికి వారి కుటుంబంలో ఆడ పిల్లలు ఉన్నారని గమనించాలని తెలిపారు. అవకాశవాద రాజకీయాలు జనసేన పార్టీ చేయదని ప్రజల సమస్యల మీదే మా పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నాగేంద్రబాబు, హరి ప్రసాద్, నాదెండ్ల మనోహర్ వంటి జనసేన నాయకులతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.