ETV Bharat / state

ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్ద కుంభకోణం: మధు యాష్కీ గౌడ్​ - మధు యాష్కీ గౌడ్​ తాజా వార్తలు

ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్ద కుంభకోణమని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ​ ఆరోపించారు. భూముల అమ్మకాలపై ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

madhuyashki goud
మధు యాష్కీ గౌడ్​, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
author img

By

Published : Jul 17, 2021, 10:16 PM IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్​లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి కార్యనిర్వహక అధ్యక్షులు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్టీకి చెందిన వివిధ కమిటీల ఛైర్మన్లు హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుదీర్ఘంగా కార్యవర్గ సమావేశం జరిగింది. భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్ద కుంభకోణం: మధు యాష్కీ గౌడ్​

48 గంటల దీక్ష

నిరుద్యోగ సమస్యపై అన్ని యునివర్సిటీలకు వెళ్లి సమగ్ర నివేదిక రూపొందిస్తామని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. విశ్వవిద్యాలయాల సందర్శన అనంతరం 48 గంటల దీక్ష చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. పంటకు మద్దతు ధర కోసం రైతులకు అండగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా పండుగ నిర్వహించాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని చెప్పారు. సొంత లాభాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ మారారని అన్నారు.

'కాంగ్రెస్​ బీ ఫామ్​, కాంగ్రెస్​ ఓటు బ్యాంకుతో గెలిచి.. డబ్బులకు లొంగి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయించాం. తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాలు కేసీఆర్​ కుటుంబానికే పరిమితమయ్యాయి.'

- మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

చేరికకు ప్రత్యేక కమిటీ

ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నాకే చేరికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక భయంతోనే తెరాస తమపై విమర్శలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. భూముల అమ్మకాలపై ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని, త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి న్యాయ పోరాటంతోపాటు.. ప్రజా క్షేత్రంలో పోరాడుతామని వెల్లడించారు.

నాయకులకు శిక్షణ తరగతులు

ఆగస్ట్ ఆఖరు వారంలో రెండు రోజుల పాటు పార్టీ నాయకులకు శిక్షణ తరగతులు ఉంటాయని మధు యాష్కీ గౌడ్​ తెలిపారు. నిఘా సంస్థ అధికారి ప్రభాకర్ రావు ప్రతిపక్షాల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి అధికారుల చిట్టాను బహిర్గతం చేస్తామని చెప్పారు. పోడు భూములపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో కోవర్ట్​లపై తమకు పూర్తి సమాచారం ఉందని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

'షర్మిల విమర్శలపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదు. వైఎస్ ఆశయాల గురించి ఆలోచించాలి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది వైఎస్ ఆశయం. రేవంత్​ రెడ్డి, ఇతర కమిటీలు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ధైర్యం పెరిగింది. పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.'

-మధు యాష్కీ గౌడ్​, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌

ఇదీ చదవండి: ఈసారి ఖైరతాబాద్ బడా​ గణేశ్ ఎత్తెంత? ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.