భారీ వర్షాలతో రాష్ట్రంలో జలాశయాలన్నీ జల కళను సంతరించుకున్నాయి. ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండిపోయాయి. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, తుంగభద్ర, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది.
నీటి మట్టాలు ఇలా...
- ఆలమట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు... ప్రస్తుత నీటి నిల్వ 121.05 టీఎంసీలు
- నారాయణపూర్ జలాశయ పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు... ప్రస్తుత నీటి నిల్వ 34.39 టీఎంసీలు
- జూరాల జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 2.37 టీఎంసీలు నీరు నిల్వ
- నాగార్జుసాగర్ జలాశయ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు... ప్రస్తుతం నీటి నిల్వ 126.47 టీఎంసీలు
- తుంగభద్ర జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 25.60 టీఎంసీలు
ఇదీ చూడండి : భారీ వర్షాలతో గోదావరికి జల కళ