ఈనెల 17న ఖైరతాబాద్ చింతల్‌బస్తీకి చెందిన నెనావత్ బంగారికి, నెహ్రూనగర్‌కి చెందిన ప్రకాశ్ రాజ్‌కు మధ్య గొడవ జరిగింది. రద్దీ ప్రాంతంలో బంగారి, ప్రకాశ్‌ను నెట్టుకుంటూ పోయాడనే చిన్న విషయానికి ఇద్దరు మధ్య వాగ్వివాదం పెరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రకాశ్.. బంగారి మీద కోపం పెంచుకున్నాడు. అదే రోజు బంగారి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికి వచ్చి సధన్ కాలేజ్ ఎదురుగా ఉన్న డివైడర్‌పై పడుకున్నాడు. ఇది గమనించిన ప్రకాశ్ అనంతరం బంగారి తలపై బండరాయితో దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు.
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా
తెల్లవారుజామున జీహెచ్ఎంసీ సిబ్బంది బంగారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసుల బృదం దర్యాప్తు చేసి... సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు ప్రకాశ్ రాజ్‌ను బోరాబండలోని అతని బంధువుల ఇంట్లో అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ