గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గత నెల డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన సాఫ్ట్వేర్ మహిళ రోహిత కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రోహిత... పుణెలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాకపోతే... రోహిత హైదరాబాద్ వచ్చేందుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని పోలీసులు రోహిత కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఎవరూ కిడ్నాప్ చేయలేదు: రోహిత
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని... ఇష్టపూర్వకంగానే పుణెకు వెళ్లినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రోహిత తెలిపారు. పుణెలో ఉద్యోగం కోసం యత్నిస్తుండగా తనపై అదృశ్యం కేసు నమోదైందని తెలిపింది.
ఇవీ చూడండి: రాజ్‌భవన్... ప్రజాభవన్: సంక్రాంతి వేడుకల్లో గవర్నర్