మోడల్ స్కూళ్ల బోధనేతర సిబ్బందికి పీఆర్సీ వర్తింపజేయాలని.. రాష్ట్ర మోడల్ స్కూల్స్ హాస్టల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం.. సమస్యలపై సానుకూలంగా స్పందించని పక్షంలో... ఈ నెల 22న డీఈఓ కార్యాలయం, 26న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
విద్యార్థుల యోగ క్షేమం కోసం.. కేర్ టేకర్, ఏఎన్ఎం, వాచ్ మెన్‌గా నిర్విరామంగా సేవలందిస్తున్న వారికి కనీస వేతనం ఇవ్వకపోవడం విచారకరమంటూ... ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ ఉద్యోగులుగా పరిగణిస్తున్నామని చెప్పడం మినహా.. ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన ఇవ్వకపోవడం బాధకరమన్నారు. 24 గంటల పని విధానం రద్దు చేసి.. డే అండ్ నైట్ షిఫ్టుల విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం కోసం నిధుల విడుదల