ETV Bharat / state

శిలాఫలకం ప్రారంభించకుండానే వెనుదిరిగిన మంత్రి సబిత.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. - hyderabad latest news

Minister fires on Officials: మంత్రుల పర్యటన అనగానే అధికారుల హడావుడి మాములుగా ఉండదు. మంత్రుల సొంత జిల్లాల్లో ఏమైనా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం ఉందంటే అప్పటికప్పుడు అక్కడి ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేసి శిలాఫలకాలు నిర్మిస్తారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర చదువుల మంత్రికి చుక్కెదురైంది.

సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Feb 7, 2023, 5:09 PM IST

Minister fires on officials: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్‌ డివిజన్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది.

ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసి ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఒక శిలాఫలకాన్ని దిమ్మెలకు ఏర్పాటు చేయగా..మరో శిలాఫలకాన్ని ఓ ఇంటికి, మరొకటి రెండు విద్యుత్‌ స్తంభాలకు వైర్లతో బిగించి గాల్లో వేలాడదీశారు.

ఈ శిలాఫలకాలను గమనించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లగానే జీహెచ్‌ఎంసీ అధికారులు వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడి నుంచి తొలగించారు.

శిలాఫలకం ఏర్పాట్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.