ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. చాకు, కర్రతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేనేజర్ అరెస్టు.. సస్పెండ్
ఉద్యోగిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి తెగబడ్డ మేనేజర్ భాస్కర్‌ను అరెస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ మేనేజర్ భాస్కర్‌ను సస్పెండ్ చేశారు.
భాస్కర్‌పై నిర్భయ కేసు
ఏపీ టూరిజం హోటల్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళపై దాడి చేయడం దారుణమన్న డీఎస్పీ.. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని అన్నారు.
ఇదీ చూడండి: ప్రవేశ పరీక్షల వాయిదా పిల్‌పై హైకోర్టులో విచారణ