ప్రఖ్యాత జ్యువెలరీ మలబార్ గ్రూప్(malabar jewelleries investments) రాష్ట్రంలో రూ.750 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్‌తో(ktr) మలబార్ గ్రూప్ అధినేత ఎం.పీ అహ్మద్ సమావేశమై తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తాజా పెట్టుబడి ద్వారా బంగారు, వజ్రాభరణాల తయారీ కేంద్రం, బంగారం శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో సుమారు రెండున్నర వేల మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మలబార్ గ్రూప్ వివరించింది.
ఇక్కడ అనుకూలం
రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన మానవ వనరులు ఉన్నాయన్న కంపెనీ.. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తమ గ్రూపులకు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
కేటీఆర్ హర్షం
రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌ను మంత్రి కేటీఆర్ స్వాగతిస్తూ.. ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు పలు జిల్లాల్లో ఉన్నారని అన్నారు. కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మలబార్ గ్రూపునకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Saidabad incident: సైదాబాద్ చిన్నారి ఘటన బాధాకరం: మంత్రి సత్యవతి