ఉత్తరాది, ఈశాన్య దిక్కుల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల పాటు చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో చలి గాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో10 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది.
- ఇదీ చూడండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం