హైదరాబాద్‌లో ఈ నెల 6న రాంకీ సంస్థలో (ramky) నిర్వహించిన తనీఖీల్లో భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ (it raids) ప్రకటన విడుదల చేసింది. స్థిరాస్తి, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ రంగంలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరపగా.. అక్రమ లావాదేవీలకు సంబంధించిన భారీ ఎత్తున పత్రాలు, షీట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కోట్లలో అక్రమ లావాదేవీలు..
2018-19 ఏడాదిలో ఈ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజారిటీ వాటాను అమ్మి భారీగా మూలధనాన్ని ఆర్జించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, లాభాలను దాచిపెట్టి నష్టాలుగా చూపెట్టినట్లు వివరించారు. దాదాపు 12 వందల కోట్ల రూపాయలకు సంబంధించిన మదింపుదారుల పన్నును ఎగ్గొట్టినట్లు ఐటీ పేర్కొంది. లాభాలను దాచిపెట్టి 288 కోట్ల రూపాయలను నష్టాలు చూపెట్టారని, వాటికి సంబంధించిన లెక్కల్లోకి రాని లావాదేవీలను గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
పన్ను చెల్లింపునుకు అంగీకారం..
కాగా లెక్కల్లోకి చూపని 300 కోట్ల రూపాయలతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు సంస్థ అంగీకరించినట్లు ఐటీ శాఖ వెల్లడించగా... తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈనెల 6న హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిపారు. సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఎకకాలంలో సోదారు నిర్వహించారు.
ఇదీ చూడండి: IT raids: రాంకీ సంస్థలో ఆదాయపన్ను శాఖ తనిఖీలు