నగరంలోని చారిత్రక ప్రాంతాల పేర్లను అందరికీ తెలియజేసేలా ప్రధాన కూడళ్లలో బోర్డులు పెట్టేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేసిన నమూనా కర్రల వంతెనను నగరమేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. రూ.18 లక్షలతో ఈ వంతెనను నిర్మించారు. పాదచారులు నడిచి వెళ్తున్న దృశ్యాలు.. కింద నేలపై పచ్చని గడ్డి, అందమైన పూల మొక్కలతో అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. భాగ్యనగరంలోని చారిత్రక ప్రదేశాలను గుర్తించి ఇలాంటి చిహ్నాలు కట్టించడం అభినందనీయమని... ఇవి నగరాభివృద్ధికి తోడ్పడుతాయని హోం మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగర చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పలు కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
లక్డీకాపూల్‌లో చారిత్రక వంతెన ప్రారంభం - bridge
హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆ ప్రాంతం పేరును గుర్తు చేసేలా చిహ్నాలను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేసిన నమూనా కర్రల వంతెన చిహ్నాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.