Court notice to venkatarami reddy: తెరాస తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. వెంకట్రామిరెడ్డి బేషరతు క్షమాపణలను లిఖితపూర్వకంగా సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. ఆయన సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
సీజే ధర్మాసనం విచారణ
సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరి విత్తనాలు అమ్మొద్దని.... కోర్టుల నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా విత్తనాల దుకాణాలను తెరిచేందుకు అనుమతివ్వబోమని వెంకట్రామిరెడ్డి(venkatarami reddy news) గతంలో వ్యాఖ్యానించారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేటకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్... వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణగా ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి సిఫార్సు చేశారు. సింగిల్ జడ్జి సిఫార్సు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
'నాలుగు వారాల్లో స్పందించాలి'
వెంకట్రామిరెడ్డి కోర్టుకు క్షమాపణ చెప్పారా? అని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. క్షమాపణ చెబుతామన్నప్పటికీ... సింగిల్ జడ్జి అంగీకరించలేదని ఏజీ తెలిపారు. వెంకట్రామిరెడ్డి బేషరతు క్షమాపణలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పిస్తామని ఏజీ పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు(telangana high court news).. నాలుగు వారాల్లో స్పందించాలని వెంకట్రామిరెడ్డిని ఆదేశించింది.
ఆ పిల్‌పై ముగిసిన విచారణ
వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనందున.. శాసనమండలికి ఆయన దాఖలు చేసిన నామినేషన్ ఆమోదించవద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగించింది. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ఆమోదించడంతో పాటు ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించినందున.. పిల్‌పై విచారణ అవసరం లేదని పిటిషన్ దాఖలు చేసిన రీసెర్చ్ స్కాలర్లు ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ తరఫు న్యాయవాది సత్యంరెడ్డి పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.
తెరాస ఎమ్మెల్సీగా..
(MLA quota MLC elections in telangana 2021) ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా తెరాస తరఫున పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి(venkatram reddy Mlc) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గులాబీ పార్టీ తరపున బరిలో దిగిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డికి రిటర్నింగ్ అధికారి(ఆర్వో) ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇతర పార్టీల నుంచిఎవరు బరిలోకి దిగకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్వో సోమవారం ప్రకటించారు.
ఇదీ చదవండి: Siddipet collector resigns: ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో తెరాసలోకి!