ETV Bharat / state

ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ కేసుల సత్వర విచారణకు హైకోర్టు రంగం సిద్ధం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని.. ప్రత్యేక న్యాయస్థానాలను హైకోర్టు ఆదేశించింది. పలు స్టేలు ఉన్న కేసులు సత్వరం తేల్చాలన్న ఉద్దేశంతో శనివారాల్లో స్వయంగా ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

The High Court has decided to hear the cases of MPs and MLAs on a daily basis
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..
author img

By

Published : Oct 4, 2020, 5:02 AM IST

ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని.. ప్రత్యేక న్యాయస్థానాలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ జరపాలని ప్రత్యేక న్యాయస్థానాలను ఆదేశించింది. తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది.

పెండింగ్‌లో 118 కేసులు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో.. 118 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఐపీసీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినవి ఉన్నాయి. మనీలాండరింగ్‌, సీబీఐ, ఏసీబీకి సంబంధించిన ప్రత్యేక కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో సగానికిపైగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించినవే. జగన్‌పై సీబీఐ 11, ఈడీ 5 కేసులు నమోదు చేశాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద జగన్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది. 2012లో 4 కేసుల్లో 2013లో 6, 2014లో మరో కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలుచేసింది.

స్వయంగా విచారణ చేపట్టాలని సీజే నిర్ణయం

ప్రస్తుతం కొన్ని కేసుల్లో హైకోర్టు స్టేలు మంజూరు చేయగా.. మిగిలినవి సీబీఐ డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యే, ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. కింది కోర్టుల్లోని కేసులపై ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో.. అవి పెండింగ్‌లో ఉన్నాయి. అలా స్టే ఉన్నవి ప్రస్తుతం 14 వరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. వాటిని సత్వరం తేల్చాలన్న ఉద్దేశంతో శనివారాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్​ఎస్​ చౌహాన్‌ స్వయంగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సమన్లు జారీ చేయండి

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో చాలా వాటిలో సమన్లు జారీ కాలేదంటూ... ఓ దిగువ కోర్టు ప్రధాన న్యాయమూర్తి... హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వారికి సమన్లు అందకపోవడం ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం... సమన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: పోకిరీలపై కొరడా కొరడా ఝుళిపింటి షీ టీం బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.